తేదీలు ఇలా ఉన్నాయి : TSPSC పరీక్షల షెడ్యూల్‌ విడుదల

TSPSCవివిధ శాఖల్లో నిర్వహించనున్న ఉద్యోగాల నియామాక పరీక్ష షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) రిలీజ్ చేసింది. గురుకుల జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు, ప్రిన్సిపల్‌ పరీక్ష షెడ్యూల్‌ను బుధవారం(ఏప్రిల్-11) ప్రకటించింది. మే 12 నుంచి 17వరకు ప్రధాన పరీక్ష నిర్వహించనుంది TSPSC. ప్రాథమిక పరీక్ష ఆధారంగా ప్రధాన పరీక్షకు 6,521 మందిని ఎంపిక చేసింది.

జూనియర్‌ కాలేజీల్లో లైబ్రేరియన్లు, డిగ్రీ కాలేజీ లైబ్రేరియన్ల పోస్టులకు మే 12… జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు మే 13న, పాఠశాల ప్రిన్సిపల్‌ ఉద్యోగాలకు మే 14న జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు మే 15న, జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపల్‌కు మే 16న, డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ ఉద్యోగాలకు మే 17న మెయిన్ పరీక్ష నిర్వహించనుంది.

గతేడాది సెప్టెంబరు 10న ప్రాథమిక పరీక్ష జరిగింది. ప్రాథమిక పరీక్ష ఫలితాలను జనవరి 20న ప్రకటించినప్పటికీ… డేటాలో లోపాల కారణంగా వాటిని రద్దుచేసి మరోసారి సమీక్ష జరిపి…మంగళవారం(ఏప్రిల్-10) ప్రకటించారు. మొత్తం 1,099 ఉద్యోగాలకు ఒక్కో పోస్టుకు 15 మంది చొప్పున 16,485 మందిని ఎంపిక చేయాలనుకున్నారు. అయితే సరైన అభ్యర్థులు లేకపోవడంతో 6,521 మందిని ప్రధాన పరీక్షకు ఎంపిక చేసినట్లు TSPSC తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates