తేదీ మారింది: మే 23న కుమారస్వామి ప్రమాణ స్వీకారం

kumarకర్ణాటకలో JDS – కాంగ్రెస్   సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కుమారస్వామి మరోసారి కింగ్  కాబోతున్నారు. కూటమి CM గా JDS  శాసనసభాపక్ష నేత HD కుమారస్వామి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈనెల 23న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కర్ణాటక CM గా బాధ్యతలు చేపట్టడం కుమారస్వామికి ఇది రెండోసారి. గతంలో BJP తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కుమారస్వామి.. ఈసారి కాంగ్రెస్ తో జట్టుకట్టారు.

బల నిరూపణకు ముందే  యాడ్యూరప్ప రాజీనామా చేయడంతో కాంగ్రెస్ – JDS  సర్కారు ఏర్పాటుకు ఆహ్వానించారు గవర్నర్ వజుబాయ్ వాలా. గవర్నర్ ఆహ్వానంతో శనివారం రాత్రి కుమారస్వామి రాజ్ భవన్ కు వెళ్లారు. ఈనెల 23న కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తామని తెలిపారు. ముందుగా రేపే సోమవారం(మే-21) ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నా…. మాజీ ప్రధాని రాజీవ్  గాంధీ వర్థంతి కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆ ఏర్పాట్లలో ఉన్నారు. దీంతో ప్రమాణ స్వీకారం 23 కు వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తుంది.  ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి … సోనియా, రాహుల్  గాంధీ వచ్చే అవకాశముంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, మాయావతితో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలకు  ఆహ్వానాలు పంపామన్నారు కుమారస్వామి.

 

Posted in Uncategorized

Latest Updates