తేల్చుకుందాం …..మమతకు ఊహించని షాక్

వెస్ట్ బెంగాల్ లో కూడా NRC(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) ప్రక్రియ చేపట్టాలని బెంగాల్ బీజేపీ నాయకులు చేస్తున్న డిమాండ్ పై సీఎం మమతాబెనర్జీ ఫైర్ అయ్యారు . వెస్ట్ బెంగాల్ లో ఏవిధంగా NRC ప్రక్రియ చేపడతారో చూస్తానని మమత అన్నరు. అసలు వాళ్లకు ఏ అర్హత ఉందని, బెంగాల్ లోఎవ్వరికీ వాళ్లు తెలియదు అని బీజేపీ నాయకులను ఉద్దేశించి మమత అన్నారు. బెంగాల్‌ లో పౌరసత్వాల గురించి తనిఖీ చేయాలన్న సందేహాలు బీజేపీ నాయకులకు ఎందుకు వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదన్నారు. అస్సాం నుంచి బెంగాళీలను తరిమి కొట్టేందుకు ఇలాంటి ముసాయిదాలను కేంద్రం చేపట్టిందని మమత తెలిపారు. NRC వల్ల భారతీయులే అధికంగా నష్టపోతున్నారని మమత అన్నారు.
మరోవైపు మమత వ్యాఖ్యలు సొంతపార్టీ తృణముల్ కాంగ్రెస్ లోనే చిచ్చురేపుతున్నాయి. అస్సాం నుంచి బెంగాలీలను తరిమేసేందేకే NRC చేపట్టారని మమత చేసిన వ్యాఖ్యలను… అస్సాం తృణముల్ కాంగ్రెస్ చీఫ్‌ ద్విపెన్‌ పఠక్‌ తప్పుబట్టారు. మమత వ్యాఖ్యలతో తాను ఏకభవీంచట్లేదని తెలిపారు. మమత వ్యాఖ్యల వల్ల అస్సాంలో అలజడులు చెలరేగుతున్నాయని, పార్టీ చీఫ్ గా ఉండటంతో అందరూ తనను తప్పు పడుతున్నారని, ఈ పరిస్ధితుల్లో తాను పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ద్విపెన్ పఠక్ తెలిపారు.

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ డ్రాఫ్ట్ ను వ్యతిరేకిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అసోం వెళ్లారు. తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సుఖేందు శేఖర్ రాయ్ నేతృత్వంలో ఆరుగురు ఎంపీలతో పాటు, బెంగాల్ మంత్రి ఒకరు అసోం చేరుకున్నారు. అయితే వారిని సిల్చర్  ఎయిర్ పోర్ట్ లోనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బయటకు వెళ్లనీయకుండా ఆపేశారు.

Posted in Uncategorized

Latest Updates