తైవాన్ లో భారీ భూకంపం..ఎమర్జెన్సీ ప్రకటన

Screen-Shot-2018-02-06-at-18.31.18తూర్పు ఆసియా దేశం తైవాన్‌లో మంగళవారం (ఫిబ్రవరి-6) రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి హువాలియెన్‌ పట్టణంలో పెద్ద పెద్ద భవనాలు, ఇతర నిర్మాణాలు కుప్పకూలిపోయాయి. వాటిల్లో వందలమంది చిక్కుకుపోయినట్లు సమాచారం.

భారీ భూకంపం తర్వాత 100సార్లకుపైగా భూమి కంపించడంతో జనం భయంతో  పరుగులుపెట్టారు. తైవాన్‌ తూర్పు తీరంలోని హువాలియెన్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియాలజికల్‌ సొసైటీ తెలిపింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. చాలా మంది తప్పించుకున్నా హోటల్‌ భవనంలో ఇంకా 50 మంది ఉండిఉండొచ్చని భావిస్తున్నారు. అటు అపార్ట్ మెంట్స్ కూడా దెబ్బతిన్నాయి.

పెద్ద సంఖ్యలో జనం శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చని అంచనా. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 11: 50 గంటలకు భూకంపం సంభవించినట్లు తైవాన్‌ మీడియా తెలిపింది. భూకంప ప్రభావం తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. సహాయకార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సిఉంది.

Posted in Uncategorized

Latest Updates