తొందరపడొద్దు : ఆర్టీసీ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు

rtcRTC ఉద్యోగ సంఘాలతో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలోని సబ్ కమిటీ చర్చించింది. సమ్మె నోటీసు వెనక్కు తీసుకోవాలని TMU నేతలను కోరారు మంత్రులు. తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు RTC ఉద్యోగ సంఘాల నేతలు. జీతాల పెంపు, డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తామనడం కరెక్ట్ కాదంటోంది ప్రభుత్వం. సమ్మె నోటీసుల ఇవ్వడంపై ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. కార్మిక సంఘాలతో మాట్లాడిన సబ్ కమిటీ సీఎంకు రిపోర్ట్ ఇచ్చే చాన్సుంది. తర్వాత మరోసారి RTC ఉద్యోగ సంఘాలతో మంత్రులు మాట్లాడతారని సమాచారం.

మరోవైపు తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు. జీతాలు పెంచితే సంస్థకు రూ.1400 కోట్లు నష్టమంటూ అధికారులు సీఎంకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. మంత్రుల కమిటీ సూచనలతో త్వరలో సీఎం కేసీఆర్ ను కలుస్తామని చెప్పారు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు.

Posted in Uncategorized

Latest Updates