“తొలిప్రేమ” అద్భుతంగా ఉంది: ట్విట్టర్ లో కేటీఆర్ ప్రశంసలు

ktr_6285రాజకీయాలతో బిజీ జీవితాన్ని గడిపే మంత్రి కేటీఆర్ సినిమా ప‌రిశ్ర‌మ‌కి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటారు. మంచి కథనం ఉన్న చిన్న సినిమాల‌ని ప్రోత్స‌హిస్తూ ఎప్పుడూ అభినందిస్తుంటారు కేటీఆర్‌. శనివారం(ఫిబ్రవరి10) రిలీజ్ అయిన వరుణ్ తేజ్ సినిమా తొలిప్రేమను చూసి ట్విట్టర్ లో ఆ సినిమా పై ప్ర‌శంస‌లు కురిపించారు. శ‌నివారం రాత్రి అద్భుతంగా గ‌డిచింది. చాలా రోజుల త‌ర్వాత తొలి ప్రేమ లాంటి సున్నిత‌మైన ప్రేమ క‌థ సినిమాను చూశాను. డైరక్టర్ వెంకీ అట్లూరి మూవీని అద్భుతంగా తెర‌కెక్కించారు. టెర్రిఫిక్ మ్యూజిక్‌, లిరిక్స్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నాల ప‌ర్‌ఫార్మెన్స్ బ్రిలియంట్ గా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన మ్యూజిక్ డైరక్టర్ థ‌మ‌న్ .. మీరు మా సినిమా చూడ‌డ‌మే కాకుండా,  సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించ‌డం చాలా ఆనందంగా ఉంది. మా ఫేవ‌రేట్ లీడ‌ర్ నుండి ల‌భించిన ప్ర‌శంస‌ల‌తో మా టీం చాలా హ్యాపీగా ఉంద‌ని రీ ట్వీట్ చేశాడు దీనికి కేటీఆర్ రిప్లయ్ ఇస్తూ.. గ్రేట్ జాబ్ థ‌మ‌న్ అంటూ అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

Posted in Uncategorized

Latest Updates