తొలి టెస్టులోనే సూపర్ సెంచరీ.. ‘పృథ్వీ షా’ రికార్డ్ ఇన్నింగ్స్

రాజ్ కోట్ : వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో ముంబై యువ క్రికెటర్ పృథ్వీ షా రికార్డులు కొల్లగొట్టే ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనింగ్ స్ట్రైకర్ గా బరిలోకి దిగిన పృథ్వీ షా .. మొదటినుంచి బౌండరీల మెరుపులు…. టెక్నిక్ తో మెరుపు సెంచరీ చేశాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసి సరికొత్త రికార్డ్ తన పేరిట రాసుకున్నాడు.

56 బాల్స్ లో ఏడు ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసిన పృథ్వీ షా… ఆ తర్వాత మరింత వేగంగా ఆడాడు. మరో 8 బౌండరీలు జోడించి… 99 బాల్స్ లోనే 15 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తిచేశాడు. ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ కొట్టిన 15వ భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అత్యంత చిన్న వయసులో సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా ఘనత సాధించాడు. పృథ్వీ కంటే ముందు.. 1955లో 17ఏళ్ల 225 రోజుల వయసులో భారత బ్యాట్స్ మన్ విజయ్ మెహ్రా  న్యూజీలాండ్ పై వంద పరుగులు సాధించాడు. 18ఏళ్ల 329 రోజుల వయసులో పృథ్వీ తాజాగా ఈ ఘనత సాధించాడు.  ప్రపంచవ్యాప్తంగా అరంగేట్ర టెస్టులోనే సెంచరీ కొట్టిన చిన్న వయస్కుల్లో పృథ్వీ షా నాలుగోవాడు. మహ్మద్ అష్రాఫుల్, మసకద్జ, సలీమ్ మాలిక్ తర్వాత తొలి టెస్టులో సెంచరీ చేసిన చిన్న వయస్కుడిగా పృథ్వీ షా పేరు రికార్డులకెక్కింది.

రంజీ, దులీప్ ట్రోఫీల్లో ఆడిన తొలి మ్యాచ్ లలోనే సెంచరీ చేసిన పృథ్వీ షా… ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ లో అరంగేట్ర మ్యాచ్ లోనే వంద రన్స్ కొట్టిన ఒకే ఒక్కడుగా చరిత్ర సృష్టించాడు.

వన్డే తరహాలో వేగంగా ఆడిన పృథ్వీ షా.. 154 బాల్స్ లో 19 ఫోర్ల సాయంతో 134 రన్స్ చేసి మూడో వికెట్ గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 51వ ఓవర్ లో.. బిషూ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు షా. టెస్ట్ మ్యాచ్ లో 87.01 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించి తన స్పీడ్ ఏంటో చూపించాడు.

 

Posted in Uncategorized

Latest Updates