తొలి టెస్ట్ ట్యూబ్ బేబీకి 40 ఏళ్లు

భారత్‌లో మొట్టమొదటి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ కనుప్రియ అలియాస్‌ దుర్గ అగర్వాల్‌ జన్మించి ఈ నెల 3తో 40 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా పుణెలో ఆమె జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచంలోనే IVF విధానంలో జన్మించిన రెండో బిడ్డ దుర్గ. 1978 జూలై 28న ఇంగ్లండ్‌లో ప్రపంచంలోనే తొలి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ జన్మించగా… ఆ తర్వాత దాదాపు రెండు నెలలకే 1978 అక్టోబరు 3న దుర్గ పుట్టింది.

కోల్‌కతాకు చెందిన డాక్టర్ సుభాష్‌ ముఖోపాధ్యాయ్‌ చేసిన అద్భుత ఆవిష్కరణకు ప్రతిరూపం దుర్గ. అయితే సుభాష్‌ బతికుండగా మాత్రం ఆయనకు గుర్తింపు దక్కకపోగా అవమానాలతో ఆయన 1981లో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.

Posted in Uncategorized

Latest Updates