తొలి టెస్ట్ లోనే మయాంక్ అగర్వాల్ అరుదైన రికార్డ్

టీమిండియా యంగ్ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఆడిన తొలి టెస్ట్ లోనే అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. మెల్ బోర్న్ వేదికగా ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో మయాంక్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 76, సెకండ్ ఇన్నింగ్స్ లో 42 రన్స్ తో మొత్తం 118 పరుగులు చేశాడు.

దీంతో విదేశీ గడ్డపై టీమిండియా తరపున ఓపెనర్‌గా అత్యధిక రన్స్ చేసిన లిస్ట్ లో మయాంక్‌ రెండో ప్లేస్ లో నిలిచాడు. ఈ లిస్ట్ లో సునీల్‌ గవాస్కర్ 132 రన్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. మయాంక్‌ తర్వాత ప్లేస్ లో ఎల్‌ఎస్‌ రాజ్‌పుత్‌ (93) ఉన్నాడు.

Posted in Uncategorized

Latest Updates