థ్యాంక్స్ మోడీ జీ : ప్రియానిక్

 ఢిల్లీ లోని తాజ్ ప్యాలెస్ లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, అమెరికన్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ ల రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన మోడీ నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించి.. గురువారం రోజు ప్రియాంక  సోషల్ మీడియా లో ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పింది. రిసెప్షన్‌లో ప్రియాంక తన భర్త నిక్‌ జోనాస్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను మోడీకి పరిచయం చేసింది. డిసెంబర్‌ 1, 2 తేదీల్లో నిక్‌ జోనస్, ప్రియాంకా చోప్రా క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్నారు.  గతంలో కూడా విరాట్‌ కోహ్లి-అనుష్క శర్మల రిసెప్షన్‌కు కూడా మోడీ హాజరయ్యారు.

Posted in Uncategorized

Latest Updates