త్యాగం జవాన్లది.. భోగం మోడీది: రణదీప్ సూర్జేవాలా

ranadeep
దేశ భద్రతను కాపాడే సైన్యాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా. సర్జికల్ స్ట్రైక్స్ వీడియోల విడుదలను తప్పుపట్టిన ఆయన… త్యాగం జవాన్లది.. భోగం మోడీది అవుతోందన్నారు. ఓడిపోతామనుకున్న ప్రతిసారి… మోడీ, అమిత్ షా సైన్యాన్ని తప్పుగా వాడుకుంటోందని అన్నారు. జవాన్ల వీరమరణాన్ని ఓట్లుగా మార్చుకోవాలని కేంద్రం చూస్తోందని అన్నారు. కశ్మీర్ సరిహద్దులో సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత.. పాక్ తీరులో మార్పు రాలేదని.. 16వందల కంటే ఎక్కువసార్లు చొరబాట్లు జరిగాయన్నారు. 79 ఉగ్రదాడులు జరిగాయన్నారు. 146 మంది జవాన్లు చనిపోయారన్నారు. ఈ విషయంలో దేశం మరింత జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయపడ్డారు సూర్జేవాల్.

Posted in Uncategorized

Latest Updates