త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

voteత్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. 60 స్థానాలకు గాను.. 59 సీట్లలో ఆదివారం(ఫిబ్రవరి-18) పోలింగ్ జరగనుంది. చారీలాం నియోజకవర్గంలో  సీపీఐ-ఎం అభ్యర్థి రామేంద్ర నారాయణ చనిపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. అక్కడ మార్చి 12న పోలింగ్ నిర్వహించనున్నారు. రేపు(ఆదివారం18) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. త్రిపురలో 25 ఏళ్లుగా లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్నాయి. దాదాపు 20 సంవత్సరాల నుంచి మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

త్రిపురలో విజయంపై ఫోకస్ పెట్టింది బీజేపీ. ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు బహిరంగ సభలు నిర్వహించారు. బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సిం, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ తరపున ప్రచారం నిర్వహించారు.  25 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న లెఫ్ట్ పార్టీ 50 ర్యాలీలు నిర్వహించింది. సీపీఎం తరపున సీఎం మాణిక్ సర్కార్, సీతారాం ఏచూరి, బృందా కారత్ లు ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఎన్నికల ప్రచారం చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates