త్రిపుర సీఎం వెటకారాలు : నా కళ్లతో చూడండి.. ఎంత బాగుందో.. ఎలా ఎంజాయ్ చేస్తున్నానో

tpమరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్(49). కొంతకాలంగా చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే మఠా అంటూ సోషల్ మీడియాలో పుకార్లు రావడంతో అనేకమంది అమాయకులను ప్రజలు కొట్టి చంపుతున్న విషయం తెలిసిందే. అయితే త్రిపురలో కూడా ఈ తరహా ఘటనలు జరిగాయి. సాక్ష్యాత్తు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం నియమించిన వ్యక్తినే కిడ్నాపర్ గా భావించి ప్జలు కొట్టి చంపారు.

ఈ సందర్భంలో బుధవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ ను రాష్ట్రంలో జరుగుతున్న వరస హత్యలపై మీ సమాధానమేంటి అని కొంతమంది రిపోర్టర్లు అడగ్గా…. ప్రస్తుతం త్రిపురలో సంతోషం రాజ్యమేలుతుందని, తాను సంతోషంగా ఉన్నానని, మీరు కూడా దీన్ని ఎంజాయ్ చేయాలని, అప్పుడు మీరు కూడా సంతోషంగా ఉంటారని అన్నారు. అంతేకాకుండా తాను ఎంత సంతోషంగా ఉన్నానో… తన ముఖం చూస్తే తెలుస్తుందనడంతో అందరూ షాక్ అయ్యారు. బిప్లబ్ వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపడంతో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది త్రిపుర ప్రభుత్వం. త్రిపుర ఎయిర్ పోర్ట్ కు మహారాజా బిర్ బిక్రమ్ మాణిక్య ఎయిర్ పోర్ట్ గా పేరు మార్చడంపై సంతోషంగా ఉన్న సీఎం ఇంకా అదే మూడ్ లో ఉన్నారని, ఆ సందర్భంగా అదే మూడ్ లో ఉండి ఆయన అన్న వ్యాఖ్యలను పత్రికలు వక్రీకరించాయని తెలిపింది. గతంలో కూడా విచిత్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు బిప్లబ్. ఒకసారి ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమవ్వడంతో సాక్ష్యాత్తూ ప్రధానమంత్రే సీఎంను ఢిల్లీకి పిలిపించి క్లాస్ పీకారు కూడా.అయినా ఇంకా సీఎం ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఆయనపై సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates