త్రిష ట్వీట్ : ఇన్నాళ్లకు తన కల నెరవేరిందట

హీరోయిన్ త్రిషకు ఇన్నాళ్లకి తన డ్రీమ్ నెరవేరిందట.  సినీ ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు దాటిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకీలాంటి సీనియర్సే కాకుండా టాప్ హీరోలందరి సరసన నటించింది. అయితే ఇప్పటివరకు సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించలేదు. లేటెస్ట్ గా రజనీ నటిస్తున్న సినిమా ‘పేట’. ఇందులో త్రిష రజనీ సరసన నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించి పోస్టర్ ను రిలీజ్ చేసింది యూనిట్. ఈ సందర్భంగా త్రిష సోషల్‌ మీడియాలో డిసెంబర్ 9న పోస్ట్‌ చేసింది. ‘నా కల నిజమైంది. ఒకే ఒక్క సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కు జంటగా నటించాను. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది..’ అని ట్వీట్ చేసింది త్రిష. కార్తీక్‌ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న పేట సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

 

 

Posted in Uncategorized

Latest Updates