త్వరగా వినేద్దాం: 27 ఏళ్ల తర్వాత కలసి పాడారు

YesudasSPBఇద్దరు సంగీత ప్రియులు పాడిన ఓ పాట ఇప్పుడు యూట్యూబ్ లో విపరీతంగా హల్ చల్ చేస్తుంది. ఈ పాటపాడిన వ్యక్తులలో ఒకరు సంగీత ప్రపంచంలో చక్రవర్తి ఏసుదాస్ అయితే మరొకరు గాన గంధర్వుడు ఎస్ పి బాల సుబ్రమణ్యం. 27 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలసి ఓ సినిమా పాటకు తమ గాత్రం అందించారు. మలయాళం, తమిళంలో తెరకెక్కుతున్న ‘కినార్-కెని‌’ సినిమాలోని ‘అయ్య సామి’ అనే పాటకు వీరు తమ గాత్రం అందించారు. ఇటీవల ఈ పాటని చిత్ర యూనిట్ యూ ట్యూబ్‌లో విడుద‌ల  చేసింది. విడుదలైన రోజ నుంచి ఈ పాట సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. ఈ పాట‌లో కేర‌ళ‌, త‌మిళ నాడు రాష్ట్రాల అందాలు, సంస్కృతితో పాటుగా క‌మ‌ల్ హాస‌న్‌, ర‌జ‌నీకాంత్, మోహ‌న్ లాల్‌, మ‌మ్ముట్టి బొమ్మ‌ల చుట్టూ క‌ళాకారులు స్టెప్పులు వేయ‌డం బకవైపు, మ‌రోప‌క్క బాలు, యేసుదాస్‌ల గానం ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. 1991లో వ‌చ్చిన ద‌ళ‌ప‌తి చిత్రంలో సింగారాలా పాట కోసం వీరిద్ద‌రు క‌లిసి పాడారు.

Posted in Uncategorized

Latest Updates