త్వరలోనే రష్యా ప్లేయర్ తో నటి శ్రీయా పెళ్లి

shriyaసినీ నటి శ్రీయా సరన్ త్వరలోనే పెళ్లికూతురు కాబోతోంది. కొద్దికాలంగా రష్యా ప్లేయర్, ప్రముఖ వ్యాపారవేత్త అండ్రీ కొచీవ్ ను వివాహం చేసుకొనుంది. రెండు దశాబ్దాల సినీ కెరీర్‌ తర్వాత దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టనుంది. శ్రీయా పెళ్లిపై మీడియాలో వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ ..ఆమె ఫ్రైడ్స్ మ్యారేజ్ విషయాన్ని కన్ఫాం చేశారు.

శ్రీయా సరన్, అండ్రీ కొశ్చెవ్‌ పెళ్లి మార్చిలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగున్నది. మార్చి 17, 18, 19 తేదీలలో ఘనంగా పెళ్లి వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే తన స్నేహితులకు, సహచర నటులకు శ్రీయా స్వయంగా ఫోన్ చేసి పెళ్లికి ఆహ్వానించినట్లు శ్రీయా సన్నిహితురాలు తెలిపింది. శ్రీయా, కొచీవ్  మ్యారేజ్ హిందూ సంప్రదాయ పద్ధతి ప్రకారం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హోళీ పండుగ థీమ్‌లో తన పెళ్లిని, సంగీత్, మెహందీ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates