త్వరలోనే వచ్చేస్తాయ్ : సెన్సార్ తెరలతో ట్రాఫిక్ సిగ్నల్స్

siglnalరోడ్డెక్కితే నడిరోడ్లపై కనిపించేవి సిగ్నల్స్. ఇవే లేకపోతే గందరగోళం, గజిబిజీ. ప్రస్తుతం ఎన్ని సిగ్నల్స్ ఉన్నా జంపింగ్స్, ఓవర్ స్పీడ్ తో క్రాస్ చేయటం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. సిగ్నల్ దగ్గర ఆగకుండా స్పీడ్ గా వెళ్లటం వల్ల యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ.. ఆధునాతన సిగ్నల్ వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పుడు ఉక్రెయిన్ లో అమలు చేస్తున్న ఈ విధానాన్ని త్వరలో ఇతర దేశాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

క్రాస్ రోడ్ల దగ్గర ఈ సెన్సార్ సిగ్నల్ ఉంటుంది. రెడ్ సిగ్నల్ పడగానే.. పెద్ద తెరగా మన ముందు ప్రత్యక్షం అవుతుంది. ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్‌ సిటీలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. దీని ప్రకారం సిగ్నల్‌ దగ్గర ముందుగా ఇరు పక్కల పెద్ద తెరలు కనిపిస్తాయి. వాటి మీద టైమ్‌ పడుతుంది. ఈ సమయంలో వాహనాలు ఫ్రీగా వెల్లిపోతుంటాయి. వాటిని దాటి ఎవరైనా రోడ్డు దాటాలని ప్రయత్నిస్తే వెంటనే అలారం మోగి ట్రాఫిక్‌ను పర్యవేక్షించేవారికి సందేశం అందుతుంది. మరోవైపు వాహనాలు వెళ్తున్న దిశలో కూడా ఈ స్క్రీన్లు దర్శనమిచ్చినప్పుడు వాహనాలు ఎక్కడిక్కడే ఆగిపోతాయి. అప్పుడు పాదాచారులు ఈజీగా రోడ్డు దాటవచ్చు. సెన్సార్‌ స్క్రీన్ల ద్వారా యాక్సిడెంట్లకు చెక్‌ పెట్టొచ్చని వారు అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates