త్వరలోనే సరికొత్తగా రూ.20 నోటు: RBI

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) త్వరలోనే కొత్త 20 రూపాయల నోటును చలామణిలోకి తీసుకురానుంది. అదనపు భద్రతా ప్రమాణాలతో ఈ నోటును మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు RBI తెలిపింది. ఇప్పటికే రూ.10, 50, 100, 200, 500, 2000 నోట్లను విడుదల చేసింది. మహాత్మాగాంధీ సిరీస్‌లో 2016 నుంచి ఈ కొత్త నోట్ల విడుదలను RBI బ్యాంకు కొనసాగిస్తోంది. ఈ కొత్త నోట్లన్నీ గతంలో ఉన్న వాటికి పూర్తి భిన్నమైన కలర్స్, సైజులతో వచ్చాయి. ఇప్పుడు కొత్తగా రూ.20 నోటు కూడా రానుంది. ఇప్పటికే తీసుకొచ్చిన మిగతా కొత్త నోట్ల మాదిరిగానే రూ.20 నోటుకూ పాత నోట్ల కంటే కాస్త చిన్న సైజులో, డిజైన్‌ కూడా పాతవాటి కంటే సరికొత్తగా ఉండనుందని  సమాచారం. 2016, మార్చి 31 నాటికి 492 కోట్ల రూ.20 నోట్లు మార్కెట్లో చెలామణి అవుతున్నాయి. 2018, మార్చి వరకు వీటి సంఖ్య వెయ్యి కోట్లకు చేరింది. మొత్తం కరెన్సీలో రూ.20 నోట్ల వాటా 9.8 శాతం.

మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌ కింద కొత్త  నోట్లను  తీసుకొచ్చినప్పటికీ… రద్దు చేసిన రూ.1000, రూ. 500 నోట్లు మినహా మిగిలిన పాత నోట్లన్నీ చలామణీలోనే ఉంటాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Posted in Uncategorized

Latest Updates