త్వరలోనే సెకండ్ ఏఎన్‌ఎంల జీతాలు పెంచుతాం : మంత్రి లక్ష్మారెడ్డి

laxma reddyసెకండ్ ఏఎన్‌ఎంల జీతాలు త్వరలోనే పెంచుతామన్నారు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా వైద్యశాఖలో నియామకాలు, ప్రభుత్వ ఆస్పత్రుల పటిష్టతపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వ ఆస్పతులను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు మంత్రి. వైద్యశాఖలో ఇప్పటికే 10 వేల ఉద్యోగాలను భర్తీ ప్రక్రియను చేపట్టినట్లు, పోస్టుల భర్తీ వివిధ దశల్లో ఉందని చెప్పారు. 747 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్‌లకు ట్రైనింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు మంత్రి.

 

Posted in Uncategorized

Latest Updates