త్వరలో అంతర్ జిల్లా టోర్నమెంట్ : వివేక్ వెంకటస్వామి

VIVEKహైద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో 3 డే లీగ్ ను ప్రారంభించారు HCA ప్రెసిడెంట్ వివేక్ వెంకటస్వామి. 3 నెలల పాటు జరగనున్న లీగ్ లో 23 జట్లు పాల్గొంటున్నాయి. ఓపెనింగ్ సెర్మనీకి HCA అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు అనిల్ కుమార్, అజ్మన్, హన్మంతరెడ్డి, HCA CEO పాండు రంగమూర్తి హాజరయ్యారు. సమ్మర్ క్యాంపులను విజయవంతంగా నిర్వహించామన్నారు చైర్మన్ వివేక్ వెంకటస్వామి.

త్వరలో అంతర్ జిల్లా టోర్నమెంట్ కండక్ట్ చేస్తామని తెలిపారు. ఫండ్స్ లేకున్నా స్పాన్సర్స్ తోనే లీగ్స్ ను సక్సెస్ గా నిర్వహిస్తున్నామన్నారు వివేక్ వెంకటస్వామి. గతేడాది అన్ని టోర్నీలో HCA జట్టు మంచి ప్రతిభ కనబరించదన్నారు. BCCI నామ్స్ ప్రకారం యాంటీ కరప్షన్ మెంబర్లని ఏర్పాటు చేశామన్నారు. ఫర్మామెన్స్ బాగున్న ప్లేయర్స్ నే సెలక్ట్ చేస్తామని చెప్పారు అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్.

Posted in Uncategorized

Latest Updates