త్వరలో పార్లమెంట్ లో బిల్లు: రెండో తరగతి వరకు నో హోం వర్క్

homeworkహోంవర్క్‌ తో ఒత్తిడిని ఎదుర్కొంటున్న చిన్నారులకు ఊరట కల్పించేందుకు చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. 1,2తరగతి చదువుతున్న విద్యార్థులకు హోం వర్క్‌ను రద్దు చేస్తూ త్వరలో కేంద్రం చట్టం చేయనుంది. ఇందుకోసం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. ఇది  ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

1, 2 తరగతుల విద్యార్థుల స్కూల్‌ బ్యాగుల బరువు తగ్గించడంతోపాటు వారికి ఎలాంటి హోంవర్క్‌ ఇవ్వకుండా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీచేయాల్సిందిగా మద్రాసు హైకోర్టు గత నెల 30న కేంద్రాన్ని ఆదేశించింది. స్కూలు బ్యాగుల బరువు తగ్గించేలా చర్యలు తీసుకోవాలంటూ సూచనలు చేసింది. విద్యార్థులు వెయిట్‌ లిఫ్టర్లు కాదని చురకలంటించింది. దీనిపై మంత్రి స్పందిస్తూ.. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Posted in Uncategorized

Latest Updates