త్వరలో రైళ్లలోను బ్లాక్ బాక్స్…!

విమానాల్లో బ్లాక్ బాక్స్ ఉంటాయి. ఇదే తరహాలో త్వరలో రైల్వేల్లోను బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. ప్రమాదాల విచారణ, సిబ్బంది  పనితీరుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి.

రైళ్లలో లోకో క్యాబ్‌ వాయిస్ రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు రైల్వేశాఖ అధికారులు. అయితే అది ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నట్లు చెప్పారు. మానవ తప్పిదాలు, సాంకేతిక లోపాలు ఏవి ప్రమాదానికి కారణమో తెలుసుకోవడానికి ఈ వీడియో… వాయిస్‌ రికార్డింగ్‌ వ్యవస్థలు ఉపయోగపడతాయి.

బ్లాక్‌ బాక్స్‌లను విమానాలు, హెలికాఫ్టర్లలో వాడుతుంటారు. ఇవి రెండు భాగాలుగా ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్‌, మరొకటి కాక్‌ పిట్ వాయిస్‌ రికార్డర్‌.

Posted in Uncategorized

Latest Updates