త్వరలో శబరిమల ఆలయానికి తృప్తీ దేశాయ్

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు వెళ్లవచ్చు అంటూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీనిపై ఇవాళ (శనివారం,అక్టోబర్-13) సామాజిక కార్యకర్త, భూమాత బ్రిగేడ్ నేత తృప్తీ దేశాయ్ స్పందాంచారు. శబరిమల ఆలయానికి వెళ్లే తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పుడు మాకు సమాన హక్కులు ఉన్నాయని, మమ్మల్ని ఎవరూ ఆపకూడదని స్పష్టం చేశారు. అయితే అయ్యప్ప భక్తుల మనోభావాలను సవాల్ చేస్తూ ఎవరూ దురుసుగా ప్రవర్తించరాదు అంటూ కేరళ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ వార్నింగ్ ఇచ్చాడు.

Posted in Uncategorized

Latest Updates