త్వరలో 4వేల పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాల భర్తీ: నాయిని

NAYANIత్వరలో మరో 4 వేల పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు  హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి. కానిస్టేబుళ్ల నియామాకాల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పిస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి హరీష్‌రావు కలిసి ప్రారంభించారు.

రాష్ట్రంలో కొత్తగా 45 పోలీసు స్టేషన్లు నిర్మించామని చెప్పారు నియిని. కొత్త జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని..పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు నాయిని.

Posted in Uncategorized

Latest Updates