థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ ట్రైలర్ రిలీజ్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, అమీర్ ఖాన్ హీరోలుగా నటించిన సినిమా థగ్స్ ఆఫ్ హిందూస్థాన్. కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఇవాళ (సెప్టెంబర్-27)న రిలీజ్ అయ్యింది. 3 నిమిషాల 38 సెకన్లున్న ఈ ట్రైలర్ లో.. అమితాబ్, అమీర్ గెట‌ప్స్ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. మోసం చేయడం నా స్వభావం అని అమితాబ్‌ తో ఆమిర్‌ అంటాడు. ఇందుకు అమితాబ్‌.. నమ్మకం నా స్వభావం అనే  డైలాగ్ ఆకట్టుకుంటుంది.

అమితాబ్, ఫాతిమా క్యారెక్టర్స్ ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. ఈ మూవీలో అమీర్ ఖాన్ ఫిరంగి ముల్లాహ్ అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌ పై ఈ మూవీని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ధూమ్-3 ఫేం విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్టర్. హిందీతో పాటు ఈ మూవీ తెలుగు, త‌మిళ భాష‌ల‌లో దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 8న రిలీజ్ కానుంది.

Posted in Uncategorized

Latest Updates