థాయ్‌లాండ్‌ ఓపెన్‌: ఫైనల్లో సింధు

థాయ్‌ లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫైనల్‌ చేరింది. శనివారం (జూలై-14) ఉమెన్స్ సింగిల్స్‌ లో భాగంగా జరిగిన సెమీఫైనల్లో సింధు 21-23, 16-21, 21-9 తేడాతో గ్రెగరియా మరిస్కాపై విజయం సాధించింది. 29వ ర్యాంకర్‌ గ్రెగరియా సింధుకు గట్టి పోటీ ఇచ్చింది. ఇద్దరి మధ్య ఫస్ట్ గేమ్‌ నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఆఖర్లో అనవసర తప్పదాలతో గ్రెగరియా పాయింట్లు సమర్పించుకోవడంతో గేమ్‌ సింధు సొంతం అయ్యింది. రెండో గేమ్‌ సింధు దూకుడుగా ప్రారంభించింది. అయితే ఆ తర్వాత గ్రెగరియా పుంజుకుని 21-16తో గేమ్‌ ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌ లో సింధు చెలరేగి ఆడింది. మొదటి నుంచి ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం సాధించింది. సింధు ధాటికి గ్రెగరియా చేతులెత్తేసింది. దీంతో సింధు 21-9తో గేమ్‌ తో పాటు మ్యాచ్‌ ను సొంతం చేసుకుంది.

ఆదివారం (జూలై-15)జరిగే ఫైనల్లో సింధు.. జపాన్‌ క్రీడాకారిణి ఒకుహారాతో తలపడనుంది. వీరిద్దరూ ఇప్పటి వరకు పది సార్లు తలపడగా చెరో ఐదు సార్లు గెలిచారు. చివరిసారిగా వీరిద్దరూ ఈ ఏడాది మార్చిలో జరిగిన ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ లో తలపడ్డారు. ఈ మ్యాచ్‌ లో సింధుదే పైచేయి.

Posted in Uncategorized

Latest Updates