థాయ్ మోస్ట్ డేంజరస్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ : పిల్లలు నవ్వారు.. ప్రపంచం ఊపిరిపీల్చుకుంది

ప్రపంచం మొత్తం నవ్వింది.. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, కనీసం ఆక్సీజన్ కూడా అందని గుహల్లో చిక్కుకున్న థాయ్ లాండ్ యువ ఫుట్ బాల్ జట్టును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పద్మవ్యూహాన్ని మించిన తామ్ లువాంగ్ కేవ్ కాంప్లెక్స్ రెస్క్యూ ఆపరేషన్ ను విజయవంతం చేశాయి సహాయక బృందాలు. స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ వ్యూహాలు, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ సహాయ సహకారాలు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రార్థనలు.. అన్నీ ఫలించాయి. బతికి వస్తారన్న గ్యారెంటీ లేని స్థితి నుంచి సజీవంగా బయటకొచ్చారు వైల్డ్ బోర్స్ ఫుట్ బాల్ ప్లేయర్లు.

వెయ్యి మందితో రెస్క్యూ ఆపరేషన్. 90 మంది స్కూబా డైవర్స్. వరల్డ్ మోస్ట్ డెడ్లీయెస్ట్, డేంజరస్ ఆపరేషన్ థాయ్ లాండ్ లోని తామ్ లువాంగ్ రెస్క్యూ ఆపరేషన్. ఓ కోచ్.. 12 మంది ఫుట్ బాల్ ప్లేయర్లను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయింది.  మూడు విడతల్లో ఆపరేషన్ ను ముగిసింది. ఒక్కో చిన్నారిని బయటకు తెచ్చేందుకు ఇద్దరు స్కూబా డైవర్లు సాయం చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 40 మంది థాయ్ డైవర్లు.. 50 మంది విదేశీ డైవర్లు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు మొత్తం ఈ ఆపరేషన్ లో తమ వంతు సాయం చేయటానికి ముందుకొచ్చాయి. సరదాగా గుహలోకి వెళ్లిన వారు.. వరద నీరు రావటంతో అలాగే లోపలికి వెళ్లిపోయారు. 4 కిలోమీటర్ల దూరం వెళ్లి.. గుహలోనే ఓ మైదాన ప్రాంతంలో తలదాచుకున్నారు. మొత్తం 17 రాత్రులు ఆ చిన్నారులు పగలు – రాత్రి ఒకటిగా బతికారు. కోచ్ దగ్గర ఉన్న కొద్దిపాటి బిస్కెట్లు మాత్రం వారి ప్రాణాలు నిలిపాయి. కోచ్ ఇచ్చిన దైర్యం ఆ పిల్లల ప్రాణాలను కాపాడింది.

అసలు ఏం జరిగింది : డేట్ లైన్ ఇలా ఉంది :

జూన్ 23 : సహాయక కోచ్ ఎక్ పాల్ మరో 12 మంది స్టూడెంట్స్ కలిసి తామ్ లువాంగ్ గుహల్లోకి ప్రవేశించారు. ఎంట్రన్స్ దగ్గర వరద నీరు మునిగిపోవటంతో అలాగే లోపలికి వెళ్లిపోయారు.

జూన్ 24 : గుహ ప్రవేశద్వారం దగ్గర కాలి గుర్తులు, సైకిళ్లు గుర్తించి గుహలో చిక్కుకున్నారని నిర్థారించారు అధికారులు.

జూన్ 26 : వరదతో గుహలోని పట్టాయ బీచ్ ప్రాంతం ఇరుకుగా మారటంతో లోపలికి వెళ్లిక నేవీ సీల్ డైవర్లు వెనక్కి వచ్చారు.

జూన్ 27 : 30 మంది అమెరికా పసిఫిట్ కమాండ్ సైనిక నిపుణులు, ముగ్గురు బ్రిటీష్ డైవర్లతో కలిసి థాయ్ లాండ్ లోని 50 మంది డైవర్లు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ వరద ప్రవాహం కారణంగా ఎలాంటి పురోగతి లేదు.

జూన్ 28 : గుహలోని నీటిని తోడేసేందుకు పెద్ద పెద్ద మోటార్లను ఏర్పాటు చేశారు. రక్షించేందుకు డ్రోన్లను ఉపయోగించారు.

జూలై 2 : విద్యార్థులు 12 మంది, కోచ్ బతికే ఉన్నట్లు ఇద్దరు బ్రిటీష్ డైవర్లు గుర్తించటంతో ఆపరేషన్ మరింత ఊపందుకుంది. వారికి ఆహారం, మందులు అందించారు.

జూలై 6 : రక్షించేందుకు వెళ్లిన సమన్ కునన్ అనే నేవీ సీల్ కమాండర్.. ట్యాంక్ లో ఆక్సీజన్ అయిపోవటంతో చనిపోయాడు.

జూలై 8 : సహాయ ఆపరేషన్ ముమ్మరం చేసిన అధికారులు.. 4 విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పిల్లలకు ఈత రాకపోవటంతో వారికి తాడు కట్టారు. ముందు, వెనక డైవర్లు ఉండి.. పిల్లల ఆక్సిజన్ సిలిండర్ కూడా వారే మోస్తూ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

జూలై 9 : మరో నలుగురు విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. మిగతా వారిని కూడా తీసుకురావాలని గుహలోకి వెళ్లిన డైవర్లకు వరద ప్రవాహం పెరగటం, భారీ వర్షాలతో గుహలోకి నీరు పోటెత్తుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు.

జూలై 10 : మిగిలిన నలుగురు పిల్లలతోపాటు కోచ్ ను కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ డెడ్లీ కేవ్ రెస్క్యూ ఆపరేషన్ గా ఇది నిలిచింది. ఒక్క డైవర్ మృతి చెందటం మినహా.. మొత్తం ఆపరేషన్ ఎంతో పకడ్బందీగా సాగింది. ఒక్క ప్రాణం పోకుండా.. అందర్నీ కాపాడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates