థాయ్ లాండ్ ఓపెన్ : ఫైనల్లో సింధు ఓటమి

థాయ్ లాండ్ ఓపెన్ విమెన్ సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓడిపోయింది. జపాన్ ప్లేయర్ నొజోమి ఒకుహరతో ఆదివారం (జూలై-15) జరిగిన ఫైనల్లో 21-15, 21-18 తో వరుస గేమ్ లలో ఓటమి పాలైంది సింధు. బ్యాంకాక్ లో జరిగిన మ్యాచ్ లో సెకండ్ సీడ్ సింధును ఫోర్త్ సీడ్ నొజోమీ ఒకుహర ఓడించింది.

ఫస్ట్ గేమ్ లో సింధును ఒకుహర డామినేట్ చేసింది. దీంతో ఈ గేమ్ 20నిమిషాల్లో ముగిసింది. అయితే సెకండ్ గేమ్ లో సింధు పుంజుకుంది. ఒక దశలో 5-1తో ఆధిక్యంలో ఉన్నా… తర్వాత సొంత తప్పిదాలతో మ్యాచ్ పై పట్టు కోల్పోయింది సింధు. దీంతో సెకండ్ గేమ్ ను, మ్యాచ్ ను ఈజీగా గెలుచుకుంది నొజోమి ఒకుహర.

Posted in Uncategorized

Latest Updates