థ్యాంక్స్ అంబానీ : జియోతో మనకు వచ్చిన లాభం రూ.60వేల కోట్లు

JIOజియో.. జియో.. జియో.. భారత టెలికాం రంగాన్ని మార్చేసింది.. ఒకే ఒక్క ఐడియాతో డేటా రేట్లను పాతాళానికి దింపేసింది. అప్పటి వరకు వందలు, వేల రూపాయలు వసూలు చేసిన టెలికాం కంపెనీలు సైతం పోటీ పడి మరీ డేటా ప్యాకేజీలు తగ్గించేశాయి. ఫ్రీ డేటా ఆఫర్స్ కూడా ఇచ్చేశాయి. దీనికి కారణం జియో. మార్కెట్ లోకి వచ్చిన తర్వాత.. కస్టమర్లకు వచ్చిన లాభం ఎంతో తెలుసా.. అక్షరాల 60వేల కోట్ల రూపాయలు. అంకెలు చూసి నోరెళ్లబెట్టొచ్చు కానీ.. ఇది అక్షర సత్యం అంటోంది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్ నెస్ నివేదిక.

2016 సెప్టెంబర్ లో మార్కెట్ లోకి అడుగు పెట్టింది జియో. ఆరు నెలలు ఫ్రీ డేటా ఇచ్చింది.  ఆ తర్వాత రూ.149కే 28 రోజులు ప్రతి రోజు ఒక GB డేటా ఇచ్చింది. జియోకి ముందు.. ఒక్క GB డేటాకి రూ.152 వసూలు చేశాయి కంపెనీలు. ఈ లెక్కన ఈ ఏడాదిన్నర కాలంలో భారతీయ వినియోగదారులకు డేటా రూపంలో 60వేల కోట్ల రూపాయలు మిగిలింది. జియో ఉచితంగా వాయిస్ కాల్స్ సదుపాయం కూడా ఇస్తుండటంతో.. మిగతా కంపెనీలు కూడా ఇదే బాటలోకి వచ్చాయి. ఈ రూపంలో కస్టమర్లు ఎంతో లాభపడ్డారని.. చుక్కల్లో ఉన్న డేటా ఛార్జీలను కిందకి దించి.. గ్రామీణులకు కూడా ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత జియోకే దక్కిందని ఆ నివేదిక వెల్లడించింది. డేటా ఛార్జీలను తగ్గించిన జియో థ్యాంక్స్ చెబుతూనే.. 60వేల రూపాయల లాభం చేకూర్చిన అంబానీకి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నారు నెటిజన్లు…

Posted in Uncategorized

Latest Updates