దంచికొట్టిన ఎండలు : మరింత పెరిగే అవకాశం

SUMMER SUNరాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. రానున్న 3,4 రోజుల్లో టెంపరేచర్స్ మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే చాన్సుంది. రాజస్థాన్ నుంచి వీస్తున్న గాలులతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలపైనే నమోదైంది. మండుతున్న ఎండలపై రాష్ట్ర ప్రభుత్వం అలర్టైంది. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షలు నిర్వహించింది. వడదెబ్బ తగులకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు అవగాహన కల్పించాలని ఆదేశించింది.

Posted in Uncategorized

Latest Updates