దంచికొడుతున్న ఎండలు: మరోమూడు రోజులు వడగాడ్పులు

summer-hotరాష్ట్రంలో  ఎండలు  దంచికొడుతున్నాయి. టెంపరేచర్స్  రికార్డ్ స్థాయిలో  నమోదు అవుతున్నాయి.  దీంతో  జనం బయటకు  రావాలంటేనే  భయపడుతున్నారు.  అయితే రాష్ట్రంలో  మరో మూడు  రోజులు  వడగాడ్పులు  వీస్తాయని  హైదరాబాద్  వాతావరణ  కేంద్రం  హెచ్చరించింది. ఇటీవల వర్షాలు కురవడంతో రెండు మూడు రోజులుగా వాతావరణం చల్లబడింది. అయితే మళ్లీ ఎండల తీవ్రత పెరిగింది.

నిజామాబాద్,  ఆదిలాబాద్  జిల్లాల్లో  అత్యధికంగా  45 డిగ్రీల ఉష్ణోగ్రతలు  నమోదు అయ్యాయి.  గాలిలో  తేమశాతం  తగ్గడం, ఉపరితల  ద్రోణుల  ప్రభావం లేకపోవడంతో  ఒక్కసారిగా  ఎండలు  పెరిగాయంటున్నారు  అధికారులు.

ఎండలు మండుతుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. వడగాడ్పులు, తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు డాక్టర్లు. పెద్దలు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపుతున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates