దక్షిణాది రాష్ట్రాల జల వివాదాలపై హై లెవల్ మీటింగ్

harish
హైదరాబాద్ వేదికగా నదిజలాలపై దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశం ఇవాళ జరుగుతోంది. బేగంపేట తాజ్ వివంతాలో జరగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి మంత్రులతో పాటు కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రి అర్జున్ రాం మేఘవాల్ ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ఏపీ, కేరళ ఇరిగేషన్ మంత్రులు సమావేశానికి హాజరుకాలేదు. నదుల అనుసంధానం, దక్షిణాదిలో జలవివాదాలపైనే ప్రధానంగా చర్చిస్తారు. ప్రధానంగా గోదావరి-కావేరి నదుల అనుసంధానంపైనే చర్చ జరగనుంది.

మహానది అనుసంధానంపై తెలంగాణకు అభ్యంతరాలు

ఒడిశాలోని మహానది నుంచి గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటకల్లోని కావేరి వరకు అనుసంధానం చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. గోదావరిపై ఖమ్మం జిల్లా అకినేపల్లి దగ్గర బ్యారేజీ నిర్మించే ఆలోచనలో ఉంది. దీనిపై గతంలో జరిగిన సమావేశంలో మన రాష్ట్రం కొన్ని అభ్యంతరాలు చెప్పింది. మహానది నుంచి గోదావరికి మిగులు జలాలు తెచ్చాకే కావేరీతో అనుసంధానం చేపట్టాలని స్పష్టం చేసింది. దీనిపై మరింత అధ్యయనం, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవడానికి కేంద్రం దక్షిణాది రాష్ట్రాలతో  ఇవాళ భేటీ ఏర్పాటు చేసింది.

కాళేశ్వంకు జాతీయ హోదా గురించి ప్రస్తావించిన హరీష్

కృష్ణా, గోదావరిలో తెలంగాణ వాటా తేల్చాలని ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం వాదించనుంది. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లయినా నీటి కేటాయింపులు తేలలేదు. దీంతో తెలంగాణ వాటా తేల్చిన తర్వాతే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయించాలని రాష్ట్రం కోరుతోంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ హోదా అంశాన్ని మీటింగ్ లో ప్రస్తావించారు మంత్రి హరీష్ రావు.  కావేరీ జలాలకు సంబంధించి కర్ణాటకకు సూచనలు చేయాలని డిమాండ్ చేయనుంది తమిళనాడు. ప్రస్తుత పంటలను కాపాడుకునేందుకుగాను కర్ణాటక 15 టీఎంసీల కావేరీజలాలను విడుదల చేసేలా చూడాలని కోరనుంది. నెయ్యార్ డ్యాం నుంచి జలాలను కేరళ విడుదల చేసేలా చర్యలపై చర్చించనుంది.

Posted in Uncategorized

Latest Updates