దట్టమైన పొగమంచు : ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు.. నలుగురు మృతి

ఏపీ : పొగమంచు కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలం తిమ్మాపురం దగ్గర ఇవాళ తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ ను, కారు ఢీకొన్న ఘటనలో కారులో ఉన్న నలుగురు మృతిచెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ట్రాక్టర్‌ లో ఉన్న ఇద్దరు కూడా గాయపడ్డారు. మృతులను గుంటూరు గోరంట్లకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో తల్లీ కుమార్తెలు జయశ్రీ, అనసూయ, రమాదేవి, డ్రైవర్‌ ఫ్రాన్సిస్‌ ఉన్నారు. కారులో  ప్రయాణిస్తున్న వారంతా చిలకలూరిపేట మండలం యడవల్లిలో సీమంతం కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచుతో ట్రాక్టర్ కనిపించలేదని తెలిపారు కారులో ఉన్నవారు. నిమషంలోనే యాక్స్ డెంట్ జరిగిపోయిందని కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదం సమయంలో కారులో 8 మంది ఉన్నామని చెప్పారు.

 

Posted in Uncategorized

Latest Updates