దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ హఠాన్మరణం

Bandaruvaisnavకేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ఇంట్లో  విషాదం చోటుచేసుకుంది. దత్తన్న కుమారుడు వైష్ణవ్ రాత్రి ( మంగళవారం,మే-22) గుండెపోటుతో చనిపోయారు. ఇంట్లో  భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు వైష్ణవ్ ను ముషీరాబాద్ లోని గురునానక్ కేర్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పన్నెండున్నరకు కన్నుమూశారు. వైష్ణవ్ దత్తాత్రేయ ఒక్కగానొక్క కొడుకు.

21 ఏళ్ల వైష్ణవ్ MBBS మూడో ఏడాది చదువుతున్నారు. వైష్ణవ్ మృతిపై బీజేపీ నేతలు సంతాపం ప్రకటించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ లో దత్తన్నను ఓదార్చారు. గవర్నర్ నరసింహన్, మంత్రి తలసాని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్,  తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, చింతల రామచంద్రారెడ్డి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీర, కోదండరెడ్డి, మాజీ మంత్రి శంకర్ రావు.. వైష్ణవ్ కు నివాళి ఆర్పించారు. దత్తత్రేయను ఓదార్చారు. వైష్ణవ్ అందరితో కలివిడిగా ఉండేవారని.. ఏ అకేషన్ అయినా ముందుండే వారని స్నేహితులు చెబుతున్నారు.

మధ్యాహ్నం 12గంటలకు రాంనగర్ నుంచి సైదాబాద్ వరకు వైష్ణవ్ అంతిమయాత్ర జరగనుంది. ఆ తర్వాత సైదాబాద్ స్మశాన వాటికలో వైష్ణవ్ అంత్యక్రియలు జరుగుతాయి. కుమారుడి మరణం దత్తన్నకు తీరనిలోటన్నారు నేతలు. చిన్న ఏజ్ లో హార్ట్ స్ట్రోక్ రావడం చాలా బాధాకరమన్నారు.

Posted in Uncategorized

Latest Updates