దరఖాస్తులు ఏవీ : డిగ్రీపై మోజు బాగా తగ్గింది

degree-admissionsఈ ఏడాది  డిగ్రీకి డిమాండ్‌ తగ్గే పరిస్థితి స్పష్టంగా కన్పిస్తోంది. డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో భాగంగా చేపట్టిన రిజిస్ట్రేషన్‌కు 1,07,450 మంది విద్యార్థులే దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 26తో దరఖాస్తుల గడువు ముగియనుంది. శనివారం సాయంత్రం వరకు మరో 10 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని చెపుతున్నారు అధికారులు.

గత సంవత్సం 2.20 లక్షల మంది డిగ్రీలో చేరగా ఈసారి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయ్యే వారే ఎక్కువగా డిగ్రీలో చేరే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు మరో లక్ష మంది వరకు విద్యార్థులు హాజరవుతున్నారు. ఆ ఫలితాలు వచ్చాక మరోసారి దరఖాస్తులకు అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates