దళారుల దోపిడీ : 3వేల క్వింటాళ్ల కందులు సీజ్

SEEZఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన కందులను గుర్తించారు అధికారులు. మార్కెట్ యార్డు గోదాముల్లో దళారులకు చెందిన 3వేల క్వింటాళ్ల కందులను సీజ్ చేశారు.

మార్క్ ఫెడ్ కి చెందిన గోదాముల్లో… రాత్రి సమయంలో అక్రమంగా కొనుగోలు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామన్నారు. అయితే ఈ వ్యవహారంలో దళారులతో పాటు అధికారుల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు రైతులు. వారం రోజులుగా మార్కెట్ లో పడిగాపులు కాస్తున్న కొనుగోలు చేయని అధికారులు.. రహస్యంగా వేలా క్వింటాళ్ల కందుల కొనుగోళ్లు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates