దళితులపై జరుగుతున్న దాడులకు కేంద్రం మద్దతు: కాంగ్రెస్

దేశవ్యాప్తంగా దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులపై లోక్ సభ దద్దరిల్లింది. దాడులకు కేంద్ర సర్కార్ మద్దతిస్తుందని ఆరోపించింది కాంగ్రెస్. జరుగుతున్న దాడులపై సమాధానం చెప్పాలని నిలదీసింది. దాడులకు కేంద్రం బాధ్యత వహించాలన్నారు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు. విపక్షాల ఆరోపణలకు సమాధానమిచ్చారు హోంమంత్రి రాజ్ నాథ్. విపక్షాలవి అనవసర ఆరోపణలని విమర్శించారు. దాడులు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న రాజ్ నాథ్.. నిన్ననే (సోమవారం,జూలై-23) హోం సెక్రటరీ అధ్యక్షతన హైలెవల్ కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.

 

Posted in Uncategorized

Latest Updates