దళితుల భూమి కోసం బడ్జెట్లో రూ.1500 కోట్లు: సీఎం కేసీఆర్

kcr-Assamblyఉద్యోగులకు మంచి జీతాలిచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు సీఎం కేసీఆర్.అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరుగుతున్న చర్చలో సీఎ మాట్లాడారు. దశాబ్దాలుగా గతంలో ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించారని ఆరోపించారు. హోంగార్డులకు నెలకు రూ.20వేలు ఇస్తున్నామన్నారు. ఉద్యోగులకు మంచి జీతాలు ఇవ్వడం కోసం ఏడాదికి రూ.1100 కోట్లు అదనంగా భరిస్తున్నామని తెలిపారు. సీపీఎస్‌ విధానం కేంద్రం చేతిలో ఉందన్నారు. మాది ఎంప్లాయిస్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. సీపీఎస్‌ పద్దతిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

దళితులకు మూడెకరాల భూమి కోసం రూ.556 కోట్లు ఖర్చు చేశామన్నారు. దళితుల భూమి కోసం ఈ బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటి వరకు 5వేల దళిత కుటుంబాలకు భూమి ఇచ్చామన్నారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని, బీజేపీ పాలించే మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రే తెలంగాణలో 52 శాతం ఆత్మహత్యలు తగ్గాయని పార్లమెంట్‌లో చెప్పారన్నారు.

Posted in Uncategorized

Latest Updates