దళిత సంఘాల భారత్ బంద్

234ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్(1989) లో సవరణలు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన రూలింగ్ ను వ్యతిరేకిస్తూ దళిత సంఘూలు ఈ రోజు (ఏప్రిల్2) భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పంజాబ్ లో రవాణా, మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు పోలీసులు. పంజాబ్‌ లోని లుథియానా, జిరాక్‌పూర్‌లో నిరసనకారులు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు.

బీహార్‌ లోని ఫోర్బెస్‌ గంజ్‌ లో నిరసనకారులు రైళ్లను అడ్డుకున్నారు. ప్రధాన రహదారులపై బైఠాయించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. రాజస్ధాన్, ఆగ్రాలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలిపారు. దీంతో స్థానిక పోలీసులు లాఠీచార్జ్‌ చేసి వారిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రాలో ఉద్రిక్తత నెలకొంది. మీరట్ లో నిరసనకారులను పోలీసులు లాఠీలతో చితకబాదారు. జార్ఖండ్ లోని రాంచీలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు.

Posted in Uncategorized

Latest Updates