దసరా ఆఫర్లు…మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

సామాన్యుడికి చుక్కులు చూపిస్తూ పెరుగుతూ వచ్చిన ఆయిల్ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రెండోరోజు కొంచెం తగ్గాయి. హైదరాబాద్ లో పెట్రోల్ పై 26 పైసలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.87.33గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ పై 24 పైసలు తగ్గి రూ. 82.38 ఉండగా, డీజిల్ పై 10 పైసలు తగ్గి రూ.75.48గా ఉంది. ముంబయిలో పెట్రోల్‌ పై 24 పైసలు, డీజిల్‌పై 11 పైసలు తగ్గడంతో పెట్రోల్‌ రూ. 87.74, డీజిల్‌ రూ. 79.13గా కొనసాగుతోంది.

దసరా కానుకగా ఈ ధరలు దిగిరావడం వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించినట్టు అయింది. పెట్రోల్‌ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాన్ని తగ్గించాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ఒక రోజు పాటు సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 22 ఉదయం ఆరు గంటల నుంచి అక్టోబరు 23 ఉదయం ఐదు గంటల వరకు సమ్మె చేస్తామని తెలిపింది. దీంతో ఢిల్లీలోని పెట్రోల్‌ బంకులు ఆ ఒక్క రోజు మూతపడనున్నాయి

Posted in Uncategorized

Latest Updates