దసరా తర్వాత రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం

తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటికే రాష్ట్ర ఎన్నిక కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల నిర్వహణ కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా దసరా తర్వాత రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం రానున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. అన్ని జిల్లాల ఓటర్ల జాబితా సవరణ పూర్తైందన్నారు. 16 నియోజకవర్గాల్లో మూడు భాషల్లో ఓటర్ల జాబితాను ముద్రిస్తున్నామన్నారు. ఉర్దూ, మరాఠి భాషల్లో ప్రింటింగ్ కు కొంత సమయం పడుతుందన్నారు. టెక్నికల్ సమస్యలతో కొన్ని పేర్లు రిపీట్ అయ్యాయన్నారు. రిపీట్ అయిన వాటిని వారం రోజుల్లో తొలగిస్తామన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న ప్రభుత్వం పథకాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు రజత్ కుమార్.

 

 

Posted in Uncategorized

Latest Updates