దసరా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన మైసూరు

మైసూరు దసరా ఉత్సవాలు బుధవారం(అక్టోబర్-10) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 7.05 నుంచి 7.35లోగా తుల లగ్నంలో దసరా మహోత్సవాలు ఆరంభమయ్యేలా ముహూర్తం నిర్ణయించారు నిర్వాహకులు. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ సుధామూర్తి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నెల 19వ తేదీ శుక్రవారం(అక్టోబర్-19) జంబూసవారీ జరుగనుంది. మధ్యాహ్నం 2.30 నుంచి 3.16 గంటల మధ్య శుభ కుంభలగ్నంలో ప్యాలెస్ లోని బలరామ ప్రధాన ద్వారంలోని నంది ధ్వజానికి కర్నాటక సీఎం కుమారస్వామి పూజలు చేయనున్నారు. 3.40 నుంచి 4.10గంల మధ్య జంబూసవారీ ఊరేగింపు ప్రారంభం కానుంది.

Posted in Uncategorized

Latest Updates