దసరా పండుగ: కిక్కిరిసిన బస్ స్టేషన్లు..ఇబ్బందుల్లో ప్రయాణికులు

దసరా పండుగ వస్తుండటంతో రాష్ట్రంలో అప్పుడే సందడి ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న వాళ్లు సొంత ఊళ్లకు వెళ్లేందుకు పయనమయ్యారు. దీంతో బస్ స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో బస్సులు రద్దీగా వెళ్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జర్నీ చేసేవారికి సంఖ్యకు తగినట్లుగా బస్సుల సంఖ్య లేక పోవడంతో బస్ స్టేషన్లలోనే గంటల తరబడి వాటి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 9 నుంచి స్కూళ్లకు,కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించడం…ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.ఇప్పటికే బస్సుల కోసం ఇబ్బందులు పడుతున్న జనం మరింత ఇక్కట్లు పడకతప్పదంటున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకుని ప్రయాణికులకు అనుగుణంగా ఆయా రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలంటున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates