దసరా బంపరాఫర్…తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

కొన్ని రోజులుగా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న ఆయిల్ ధరలు విజయదశమి పండుగ సందర్భంగా కొద్దిగా తగ్గి వాహనదారులకి ఉపశమనం కలిగించాయి. దేశ రాజధాని ఢిల్లీలో, మైంబై, కోల్ కతా లలో పెట్రోల్‌పై 21 పైసలు, డీజిల్‌పై 11 పైసలు తగ్గింది. హైదరాబాద్ , చెన్నైలలో లీటరు పెట్రోల్ పై 22 పైసలు, డీజిల్ పై 12 పైసలు తగ్గింది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 87.59 గా ఉండగా, డీజిల్ ధర రూ. 82.21గా ఉంది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.85.88 ఉండగా, డీజిల్ ధర రూ.79.93కు చేరింది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.82.62 ఉండగా డీజిల్ ధర రూ.75.58గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.88.08 ఉండగా, డీజిల్ రూ.79.35గా ఉంది.

Posted in Uncategorized

Latest Updates