దసరా రోజు బాబా గుడి 24 గంటలు తెరిచే ఉంటుంది

షిర్డీలోని సాయిబాబాను సంద‌ర్శించుకోవాల‌నే భక్తులకు శుభవార్త. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 18న షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని భక్తుల సందర్శన కోసం 24 గంటలపాటు తెరచి ఉంచాలని శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు నిర్ణయించింది. సాధారణంగా సాయిబాబా ఆలయాన్నితెల్లవారుజామున నాలుగు గంటలకు తెరచి రాత్రి 11 గంటలకు మూసివేస్తారు. అయితే షిర్డీసాయి 100వ జయంతోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీతోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. దీంతో ట్ర‌స్టు ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్రమంలో పెయిడ్ VIP పాసుల జారీని నిలిపివేయాలని నిర్ణయించింది.

 

 

Posted in Uncategorized

Latest Updates