దాడి చేయమని మాటిస్తే వస్తాం:  అన్షు ప్రకాశ్

arvind-csఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై ఆ రాష్ట్ర అధికార పార్టీ ఆమ్ ఆద్మీకి చెందిన ఎమ్మెల్యేలు ఇటీవల దాడి చేశారు. ఈ దాడి సాక్షాత్ ఢిల్లీ  సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే జరిగింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి, ఈ దాడితో సంబంధం ఉన్న ఆప్ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు.

అయితే వచ్చే నెలాఖరులోగా ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇందుకోసం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో CS అన్షు ప్రకాశ్ మరోసారి సమావేశం కావాల్సి ఉంది. బడ్జెట్ సమావేశాలపై చర్చించాల్సి ఉంది. అయితే తనతోపాటు ఇతర అధికారులపై చేయి చేసుకోమని హామీ ఇస్తేనే వస్తానని అన్షు ప్రకాశ్ సీఎంకు ఓ లేఖ రాశారు. ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశ తేదీలను ఖరారు చేయడానికి ఈ భేటీ నిర్వహించాలనుకుంటున్నట్లు లేఖలో సీఎస్ చెప్పారు.

 

Posted in Uncategorized

Latest Updates