దానికోసమే : ఆంటిగ్వా పౌరసత్వంపై PNB నిందితుడు మెహుల్ చోక్సీ


పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) కుంభకోణం కేసులో వజ్రాల వ్యాపారవేత్త మెహుల్ చోక్సీ ప్రధాన సూత్రధారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED) తెలిపింది. చోక్సీకి వ్యతిరేకంగా ముంబై కోర్టులో ఈడీ చార్జిషీటు వేసింది. అతిపెద్ద స్కామ్ వెనుక మాస్టర్‌ మైండ్ చోక్సీ అని తన చార్జ్‌ షీట్‌ లో ఈడీ స్పష్టం చేసింది. మొత్తం స్కామ్‌ ను చోక్సీనే డిజైన్ చేశాడని, ఎగుమతులు దిగుమతుల పేరుతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను విదేశాలను తరలించాడని తెలిపింది. చోక్సీ కంపెనీలో ఉన్న డైరెక్టర్లు, బాగస్వాములు అంతా డమ్మీలు అని… అసలైన నిర్ణయాలన్నీ చోక్సీ తీసుకునేవాడని లేలింది. ప్రస్తుతం పరారీలో ఉన్న చోక్సీ ఆంటిగ్వా ఉంటున్నాడు.పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం వెలుగులోకి వచ్చే ముందే…. గత ఏడాది నవంబర్ లో చోక్సీకి ఆంటిగ్వా దేశ పౌరసత్వం లభించింది. ఈ ఏడాది జనవరిలో చోక్సీ దేశం విడిచిపెట్టి పారిపోయాడు. చోక్సీకి సంబంధిన డీటెయిల్స్ చెప్పాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల క్రితం ఆంటిగ్వా అధికారులకు సీబీఐ లెటర్ రాసింది. చోక్సీని పట్టుకోవడానికి ఇంటర్ పోల్ కూడా నోటీస్ జారీ చేసినట్లు ఆ లెటర్ లో సీబీఐ తెలిపింది. చోక్సీ ఉన్న లొకేషన్, చోక్సీ కదలికలను తమకు తెలియజేయాలని సీబీఐ ఆ లెటర్ లో ఆంటిగ్వా అధికారులను కోరింది. అయితే చాన్నాళ్ల క్రితమే చట్టప్రకారమే తాను ఆంటిగ్వాలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చోక్సీ తన లాయర్ ద్వారా తెలిపాడు. ఇన్వెస్ట్‌ మెంట్ ప్రోగ్రామ్ కింద తాను ఆంటిగ్వా వీసా తీసుకున్నట్లు చోక్సీ తెలిపాడు. ఆంటిగ్వా పౌరసత్వం పొందటం ద్వారా 130 దేశాకు వీసా ఫ్రీ ప్రయాణానికి అవకాశముంటందని,ఇది తన వ్యాపార విస్తరణకు ఉపయోగపడుతుందని చోక్సీ తెలిపాడు. అయితే భారత్-ఆంటిగ్వాల మధ్య నేరస్ధుల అప్పగింతకు సంబంధించి ఎటువంటి ఒప్పందాలు లేవు.

Posted in Uncategorized

Latest Updates