దారికొచ్చారు : మిత్రపక్షాలతో అమిత్ షా భేటీలు

uddav

ఇన్నాళ్లు ఒంటెద్దు పోకలతో వెళ్లిన బీజేపీ.. ఇప్పుడు దారికొచ్చినట్లు కనిపిస్తోంది. NDAలోని మిత్ర పక్షాలను సైతం లెక్కచేయని తన వైఖరిని మార్చుకుంటోంది. ఇటీవల దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవటం.. ప్రతిపక్షాలు అన్నీ ఒక్కతాటిపైకి వచ్చి.. కమలానికి షాక్ ఇస్తున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే.. తన వెంట నడుస్తున్న పార్టీల అధినేతలతో భేటీలకు సిద్ధం అవుతున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. అందులో భాగంగానే మొదటగా మహారాష్ట్ర నుంచి మొదలుపెట్టారు.

జూన్ 6వ తేదీ బుధవారం శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో సమావేశం అవుతున్నారు. ముంబైలోని ఆయన నివాసంలోనే ఈ సమావేశం జరగనుంది. కొంతకాలంగా బీజేపీ – శివసేన మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల ఎన్నికల ఫలితాలు కూడా వీరిలో మార్పునకు కారణం అయ్యిందని.. అమిత్ షా సూచనతోనే ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌. 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలో ఒంటరిగా కాకుండా.. కలిసి వెళ్లటానికి ఈ భేటీ ఎంతో ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు రెండు పార్టీల నేతలు. శివసేనతో భేటీ తర్వాత పంజాబ్ లో అకాలీదళ్ పార్టీ నేతలతోనే అమిత్ షా భేటీ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా దేశవ్యాప్తంగా బీజేపీతో కలిసి నడుస్తున్న NDA మిత్రపక్షాల నేతలందరినీ షా.. ఆయా రాష్ట్రాలకు వెళ్లి సమావేశం కావాలని నిర్ణయించారు.

Posted in Uncategorized

Latest Updates