దారినపోయే దాన్ని తలకెత్తుకున్నారు : నెటిజన్లతో తిట్టించుకుంటున్న కోహ్లీ, అనుష్క

kohli-and-anushkaబాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. అనుష్కపై తీవ్రస్ధాయిలో సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అనుష్క భర్త టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై కూడా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతలా నెటిజన్ల ఆగ్రహానికి గురవ్వటానికి సోషల్ మీడియాలో కోహ్లీ పోస్ట్ చేసిన ఓ వీడియో కారణం అయింది.

కొన్ని రోజుల క్రితం.. కోహ్లీ, అనుష్క శర్మ కారులో ప్రయాణిస్తున్న సమయంలో.. పక్కనే కారులో వెళ్తున్న అర్హాన్‌ సింగ్‌ అనే వ్యక్తి తన కారు నుంచి ఓ ప్లాస్టిక్‌ కవర్ ను రోడ్డుపై పడేశాడు. దీన్ని చూసిన అనుష్క కారును ఆపి అర్హాన్‌ సింగ్‌ తీరుపై మండిపడ్డారు. ప్లాస్టిక్ ను డస్ట్ బిన్ లో వేయకుండా రోడ్డుపై ఎందుకు వేస్తున్నావంటూ అతడిని నానా మాటలు అంది. ఈ సమయంలో పక్కనే ఉన్న కోహ్లీ ఈ ఘటనను వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. రోడ్డుపై ఎవరైనా చెత్త పడేయడం చూసినప్పుడు మీరు కూడా ఇలానే ప్రశ్నించండి.. అవగాహన కల్పించండి అంటూ ట్వీట్‌ చేశాడు. దీంతో ఫేస్ బుక్ ద్వారా తన తప్పుకి క్షమాపణలు తెలిపిన అర్హాన్‌ సింగ్‌.. తనపై అనుష్క, కోహ్లీ ప్రవర్తించిన తీరును తప్పుపట్టారు. నేను రోడ్డుపై పడేసిన చెత్త కంటే.. అనుష్క నోట్లో నుంచి వచ్చిన చెత్తే ఎక్కువగా ఉంది. ఒక సెలబ్రిటీ అయిన మీకు.. ఇది మర్యాద అనిపించుకోదని అర్హాన్ సింగ్ తెలిపాడు.

ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. కోహ్లీ, అనుష్కల తీరుపై సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పార్టీల సమయంలో కేక్‌ మొత్తం ముఖానికి పూసుకుని దానిని వృథా చేస్తున్నారు. దేశంలో ఎంతో మంది చిన్నారులు తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. మీకు మాత్రం అది ఎంజాయ్ కదా, ఈసారి కేక్‌కు బదులు ఆవు పేడ పూసుకో అంటూ అనుష్కను తిట్టిపోస్తున్నారు.

రోడ్డుపై వెళ్లే వారిని కాదు ముందు గ్రౌండ్ లో నోటికొచ్చినట్లు తిట్టే నీ భర్తను కంట్రోల్‌లో పెట్టు అంటూ అనుష్కపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కోహ్లీపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ భార్య హీరోయిజాన్ని సోషల్‌ మీడియాలో అందరికీ చూపించాల్సిన అవసరం లేదని.. ఏదో భరత్ లో మొట్టమెదటిసారిగా చెత్తను రోడ్డుపై పడేసినట్లు అతన్ని ఈ రకంగా తిట్టి.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మీ భార్యకు పబ్లిసిటీ కల్పిద్దామనుకుంటున్నావా అని కోహ్లీ తీరుని కూడా తప్పుబట్టారు.

Posted in Uncategorized

Latest Updates