దారుణం : ఆడపిల్ల పుట్టిందని భార్యకు కరెంట్ షాక్

currentవిజయవాడ కానూరులో దారుణం జరిగింది. భార్య ఆడపిల్లకు జన్మనిచ్చిందని భర్త ఆగ్రహానికి గురై భార్యకు కరెంట్ షాక్ ఇచ్చాడు. వారికి ఒక కుమారుడు ఉండగా రెండో కాన్పులో ఆమె ఆడపిల్లకు జన్మించింది. అది జీర్ణించుకోలేని భర్త ఈ దారుణానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమపెళ్లి చేసుకొని అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని ఆ ఫిర్యాదులో చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పెనమలూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వివరాళ్లోకివెళితే..కృష్ణా జిల్లా పెనమలూరులో నాలుగు సంవత్సరాల క్రితం పెనమలూరు పెద్ద గుడి ప్రాంతానికి చెందిన ప్రశాంతి, అదే ప్రాంతానికి చెందిన శ్రీలం రాజారత్నం  ప్రేమించుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఇంటి వద్దే ఉండి పని చేస్తున్నాడు.  వీరికి మొదటి సంతానం బాబు పుట్టాడు.ఆ తరువాత నుంచి రాజా కట్నం తీసుకు రమ్మని భార్యను వేధించసాగాడు. భర్త వేధింపుల పై భార్య గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పెద్ద మనుషులు రాజీ చేయడంతో కేసు ఉపసంహరించుకుంది. ఇటీవల వీరికి పాప పుట్టింది. ఆడపిల్ల పుట్టడంతో భర్త రాజా భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 2న ప్రశాంతి తల్లి బాబును ఆడిస్తుండగా రాజా ఇంటికి వచ్చాడు. గదిలో నిద్రిస్తున్న భార్య ప్రశాంతి, పాప వద్దకు వచ్చి, ప్లగ్‌లో కరెంటు వైర్లు ఉంచి భార్యకు కరెంట్‌షాక్‌ ఇచ్చాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా నిద్ర లేచిన ప్రశాంతి భయంతో కేకలు వేయగా.. బయట ఉన్న ఆమె తల్లి ఇంట్లోకి వచ్చింది. దీంతో  రాజా అక్కడినుంచి పారిపోయాడని ఫిర్యాదులో చెప్పింది. ఈ ఘటనపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. భర్త రాజా,  అతని తండ్రిపై పోలీసులు కట్నం, దాడి కేసు నమోదు చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates